కడప జిల్లా మైలవరం మండలం అయ్యవారిపల్లి గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గంగన్న అనే రైతు అప్పుల బాధ భరించలేక విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ పొలాల వద్ద ఏర్పాటు చేసిన 220 కేవీ విద్యుత్ తీగలను పట్టుకొని తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని గంగన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మైలవరం ఎస్సై.... గంగన్న మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
అప్పుల బాధ భరించలేక.. విద్యుత్ తీగలు పట్టుకొని రైతు ఆత్మహత్య - అయ్యవారిపల్లె రైతు ఆత్మహత్య వార్తలు
అప్పుల బాధలతో ఓ రైతు విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన కడప జిల్లా అయ్యవారిపల్లెలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు పట్టుకొని రైతు ఆత్మహత్య