Pulivendula politics: శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి.. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఆసక్తి వైఎస్ఆర్(కడప) జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తెదేపాలోకి రావాలంటూ ఆయన అనుచరులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పులివెందుల నియోజకవర్గంలోని తెదేపా ముఖ్యనాయకులు.. వేంపల్లెలోని సతీశ్‌రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. సతీశ్ రెడ్డి ముఖ్య అనుచరులు భారీగా రావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయనతో నేతలు చర్చలు జరిపారు. అనుచరులు ఒత్తిడి చేసినప్పటికీ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. అయితే.. సతీశ్‌రెడ్డి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
సతీష్‌రెడ్డి నిర్ణయమేంటి..? అభిమానుల్లో ఉత్కంఠ - Chairman Satish Reddy political issue
Kadapa News: శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి రాజకీయ నిర్ణయంపై అనిశ్చితి నెలకొంది. తెదేపాలోకి రావాలంటూ.. ఆయన అనుచరులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
![సతీష్‌రెడ్డి నిర్ణయమేంటి..? అభిమానుల్లో ఉత్కంఠ kadapa tdp leaders](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15505367-748-15505367-1654685356382.jpg)
kadapa tdp leaders