కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు చేశారు. శనివారం పట్టణంలోని కొన్ని మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంజామల మోటు లోని ఓ దుకాణంలో గడువు ముగిసిన 44 బీర్ కేసులను గుర్తించారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగులోని వివిధ మద్యం దుకాణాలపై రెండురోజులుగా దాడులు చేసి కాలం చెల్లిన మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై కవిత తెలిపారు.
ఆబ్కారీ అధికారుల తనిఖీలు... కాలం చెల్లిన మద్యం ధ్వంసం - ఎక్సైజ్ ఎస్సై కవిత తనిఖీలు
కడప జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆబ్కారీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గడువు ముగిసిన మద్యాన్ని గుర్తించి ధ్వంసం చేశారు.
ఆబ్కారీ అధికారుల తనిఖీలు... కాలం చెల్లిన మద్యం ధ్వంసం