కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లి గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేశారు. సారా తయారు చేసేందుకు ఉపయోగపడే బెల్లం ఊటను గుర్తించారు. మొదటగా గంగమ్మ గుడి దగ్గరున్న కాళీ వాటర్ ట్యాంక్ సమీపంలో.. 8 ప్లాస్టిక్ బిందెల్లో ఉన్న 120 లీటర్ల బెల్లం ఊటను... అనంతరం మరో 27 ప్లాస్టిక్ బిందెల్లో దొరికిన 405 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్టు తెలిపారు.
525 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - kadapa district latest news
రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లి గ్రామంలో రెండు చోట్ల దొరికిన 525 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.
రైల్వే కోడూరు మండలంలో ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు