రాష్ట్రంలో వైకాపా పాలన అధ్వాన్నంగా ఉందని భాజపా నేత రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. రెండు పార్టీలది దోచుకునే ధోరణే తప్ప ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందన్నారు. ఏ వర్గం వారు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. ఇసుక విధానంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపట్ల చాలామంది రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రత్యమ్నాయ పార్టీగా భాజపా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ విధానాలు నచ్చటంతోనే చాలామంది సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు.
'దోచుకునే ధోరణి తప్ప...ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేదు' - there is no intention of serving the public
వైకాపా ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భాజపా నేత రావెల కిశోర్‌బాబు విమర్శించారు. రాష్ట్రంలో పాలన అధ్వాన్నంగా ఉందని దోచుకునే ధోరణి తప్ప ప్రజా సేవ చేయాలనే తపన ఎక్కడా కనిపించటంలేదని మండిపడ్డారు.
!['దోచుకునే ధోరణి తప్ప...ప్రజలకు సేవ చేసే ఉద్దేశం లేదు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4601734-367-4601734-1569841670055.jpg)
భాజపా నేత రావెల కిషోర్ బాబు