కడప జిల్లా బద్వేలు లక్ష్మీపాలెం పెద్ద చెరువు వద్ద వెలిసిన ఉరుములు అమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. గ్రామానికి దూరంగా ఉన్న..ఈ 16వ శతాబ్దంనాటి ఆలయంలో ఎలాంటి పూజలు జరగడం లేదు. నర సంచారం లేకపోవడంతో దుండగులు ఈ ఆలయాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆలయంలోని శబ్దాలు రావడంతో వ్యవసాయ పొలాల వద్ద కు వెళ్తున్న రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు ఎవరు జరిపారు అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
గుప్తనిధులు కోసం తవ్వకాలు - గుప్తనిధుల కోసం ఆన్వేషణ
అది 16వ శతాబ్దం నాటి అమ్మవారి ఆలయం. కొన్నేళ్లుగా అక్కడ ఎలాంటి పూజలు జరగడం లేదు. గ్రామానికి దూరంగా ఉండటంతో...జన సంచారం కూడా పెద్దగా ఉండదు. ఇదే అదునుగా భావించిన దుండుగలు అక్కడ గుప్తనిధులు కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటన కడపజిల్లా బద్వేలు లక్ష్మీపాలెంలో చోటుచేసుకుంది.
Excavations for hidden treasures