ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాజీ సైనికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది' - మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ తాజా వ్యాఖ్యలు

కడప సీఎస్ఐ పాఠశాల ఆవరణలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

ex-servicemen Welfare Association meeting
మాజీ సైనిక సంక్షేమ ఆధ్వర్యంలో సమావేశం

By

Published : Jan 10, 2021, 5:40 PM IST

ప్రభుత్వం మాజీ సైనికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మీ నారాయణ ఆరోపించారు. కడప సీఎస్ఐ పాఠశాల ఆవరణలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్ర సైనిక సంక్షేమ అధికారి లేకపోవటం వల్ల పలు సమస్యలతో సతమతమవుతున్నామని వారు పేర్కొన్నారు. చాలామంది మాజీ సైనికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. జిల్లాలో చాలా మంది మాజీ సైనికులకు ప్రభుత్వ స్థలాలు ఇప్పటికీ రాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని మాజీ సైనికుల సంక్షేమ సంఘం సభ్యులు హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details