కడప జిల్లా జమ్మల మడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ (EX MLC Narayana Reddy Joined in TDP) నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేశ్ రెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. భూపేశ్ రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలను అప్పగించారు. నారాయణ రెడ్డి.. ప్రస్తుతం భాజపాలో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి సోదరుడు.
జగన్ పట్టించుకోలేదు..
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలు అల్లాడితుంటే.. ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. కనీసం వరదల్లో కొట్టుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. ప్రకృతి విపత్తుల వేళ కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. గుంటూరులో రౌడీ మామూలు ఇవ్వలేదని బెదిరింపులకు దిగారన్నారు.