మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సతీమణి లక్ష్మీప్రసన్న దీక్ష చేపట్టారు. ఆమె నివాసంలో 12 గంటల దీక్ష చేపట్టారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడమేంటని ప్రశ్నించారు. మద్యం ధరలు పెంచి పేద ప్రజల కడుపు కొడుతున్నారన్నారు. మద్యపానం నిషేదం అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.. లాక్‌డౌన్‌లో మద్యం విక్రయాలకు అనుమతివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాలు మూసివేయాలని మాజీ ఎమ్మెల్యే భార్య దీక్ష - కడపలో మద్యం దుకాణాల వార్తలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సతీమతి లక్ష్మీప్రసన్న 12 గంటల దీక్ష చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. మద్యం ధరలు పెంచి పేద ప్రజల కడుపు కొడుతున్నారన్నారు.
ex mla wife protest