రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వండి - ex mla lingareddy 12-hour hunger strike latest news update
దుకాణాలు తెరిచే అంశంలో ఇంకొన్ని వెసులుబాట్లు కల్పించాలని కోరుతూ... తెలుగుదేశం నేత లింగారెడ్డి ఆందోళన చేపట్టారు. రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతించాలని ప్రొద్దుటూరులోని తన నివాసంలో దీక్షకు దిగారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. రాత్రి 7 గంటల వరకు అన్ని వ్యాపార దుకాణాలు తెరిచేేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దీక్షకు పూనుకున్నారు. కరోనాతో వ్యాపారాలు జరగక, అద్దెలు, గుమస్తాలకు జీతాలు ఇవ్వలేక వ్యాపారస్థులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాయంత్రం 4 గంటల వరకే వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఉన్నా ఉపయోగం లేదన్నారు. వ్యాపారుల కష్టాలు దృష్టిలో ఉంచుకొని రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తేరిచేందుకు అధికారులు అనుమతివ్వాలని కోరారు.