ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండె పోటుతో మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి మృతి - kadapa latest news

కడప మాజీ ఎమెల్యే కందుల శివానందరెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుముూశారు. ఈయన మృతిపట్ల పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు సంతాపం తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి గుండెపోటుతో మృతి
మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి గుండెపోటుతో మృతి

By

Published : Nov 4, 2020, 11:55 AM IST




కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. 1981లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా, 1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగారు. కడప జిల్లా తెదేపా అధ్యక్షుడుగా పని చేశారు. కడప, రాయలసీమ పేరిట స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. అలానే కందుల గ్రూప్ ఆఫ్ కళాశాలలను ఏర్పాటు చేశారు. కడపలో కందుల కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. కొంతకాలం నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కందుల శివానందరెడ్డి సోదరుడు కందుల రాజమోహన్రెడ్డి భాజపాలో రాష్ట్రస్థాయి నాయకత్వంలో పని చేస్తున్నారు. ఈయన మృతికి పలువురు నాయకులు, విద్యావేత్తలు సంతాపం తెలిపారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details