ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో 50 వేల ఆధిక్యంతో గెలుస్తా: డీఎల్ - ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి కామెంట్స్

కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డి.ఎల్‌.రవీంద్రారెడ్డి.. వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని స్పష్టం చేశారు.

'నేడు అంతా దోపిడీమయంగా తయారైంది'
'నేడు అంతా దోపిడీమయంగా తయారైంది'

By

Published : Feb 7, 2021, 10:33 PM IST

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పంచాయతీ ఎన్నికలను నాందిగా తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే డి.ఎల్.రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2014 నుంచి 2019 వరకు తెదేపా హయాంలో కొంత మేర అభివృద్ధి జరిగిందన్నారు.

ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజాసేవకే కానీ దోపిడీకి కాదన్నారు. నేడు అంతా దోపిడీమయంగా తయారైందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని, అవినీతిపై స్పందిస్తున్నారని చెప్పారు. కింది స్థాయిలో జరిగే అన్యాయాలను అధికారుల అలసత్వంతో ముఖ్యమంత్రి దృష్టికి పోవడం లేదని చెప్పారు. కిందిస్థాయిలో జరిగే అవినీతిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ABOUT THE AUTHOR

...view details