ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులపై ప్రభుత్వాలది నిర్లక్ష్య వైఖరి' - farmers conference at kadapa latest news

మోదీ సర్కార్.. రైతుల నడ్డి విరిచేలా.. వ్యవసాయ బిల్లులను ఆమోదించడం దారుణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి అన్నారు. కడప జిల్లాలో లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతింటే పట్టించుకునే నాథుడే కరవయ్యాడని మండిపడ్డారు.

'రైతులపై ప్రభుత్వాలది నిర్లక్ష్య వైఖరి'
'రైతులపై ప్రభుత్వాలది నిర్లక్ష్య వైఖరి'

By

Published : Oct 18, 2020, 3:28 PM IST

కడప సీపీఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన బడా వ్యక్తులు లక్షల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి వెళ్తున్నారని వడ్డే శోభనాద్రి విమర్శించారు. వ్యవసాయానికి విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేయడం అనేది సరైన నిర్ణయం కాదని ఖండించారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details