ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రాణహాని లేనప్పుడు భద్రతను ఉపసంహరించడం సరైనదే'

మాజీ మంత్రి సీ. ఆదినారాయణరెడ్డికి భద్రత తొలగింపును సమర్ధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ కె . లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ex minister adinarayanareddy petetion rejected in highcourt
ఏపీ హైకోర్టు

By

Published : Aug 12, 2020, 9:10 AM IST

మాజీ మంత్రి సీ. ఆదినారాయణరెడ్డికి భద్రత తొలగింపును సమర్ధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన అప్పీల్​ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ కె . లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

రాజకీయ కారణాలతో తనకు ఉన్న 1+1 భద్రతను ప్రభుత్వం తొలగించిందని పేర్కొంటూ ఆదినారాయణరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రాణహాని లేనప్పుడు భద్రతను ఉపసంహరించుకోవడం సరైనదేనని పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను ఆదినారాయణరెడ్డి ధర్మాసనం ముందు సవాలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది . ప్రాణహాని ఉందని భావించినప్పుడు భద్రత కోసం సంబంధిత అధికారుల్ని ఆశ్రయించేందుకు అప్పీల్ దారుకు వెసులుబాటు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details