గడిచిన ఏడాది కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని సరస్వతి విద్యా మందిరంలో భాజపా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.
'ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు' - మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తాజా వార్తలు
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో భాజపా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ పంచారు.
ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి
కరోనా మహమ్మారిపై భాజపా పోరాడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని కోరారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. వైరస్ విజృంభిస్తున్న వేల పరీక్షలు నిర్వహించడం అంత మంచిది కాదని ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి.... 'సారా మత్తులో.. గర్భిణి అని చూడకుండా భార్యను హత్య చేశాడు'