మైదుకూరులో గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకాలు - మైదుకూరులో గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఏర్పాటు వార్తలు
జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ జిల్లా సంచాలకులు సత్య ప్రకాష్ ఈ కార్యక్రమంలో గోమాతకు పూజలు నిర్వహించి.. ట్యాగ్ వేశారు. అనంతరం టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరు నెలలు దాటిన ప్రతి పశువుకు టీకాలు వేయించాలని సత్య ప్రకాష్ సూచించారు.
గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం ఏర్పాటు