కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విజయ్‌బాబు అనే సామాన్య కార్మికుడు చేతులు శుభ్రం చేసుకునే కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అతను వృత్తిరీత్యా రోజు కూలీకి వెళ్లి పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం కోసం సామాజిక బాధ్యతగా తన వంతు కృషి చేస్తున్నాడు. కూరగాయల మార్కెట్‌కు వచ్చే ప్రజలు, ఆరోగ్య రీత్యా వాకింగ్‌కి వచ్చే వారికి చేతుల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాడు. చేతి శుభ్రత ఆవశ్యకతను వివరిస్తున్నాడు. కరోనాను దూరం చేయాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నాడు.
కరోనా వ్యాప్తిపై సామాన్య పౌరుడి సామాజిక భాద్యత - రాజంపేటలో చేతి శుభ్రత కేంద్రం ఏర్పాటు
కరోనాని తరిమేయాలంటే సామాజికి భాద్యత చాలా అవసరం. చేతి శుభ్రత మరింత ముఖ్యం. ఇదే అతను చేస్తున్న పని. కూలీ పనిచేస్తున్నా.. ప్రజారోగ్యం కోసం చేతి శుభ్రత కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మరి ఆ వ్యక్తి గురించి మనమూ తెలుసుకుందామా..!
Establishment of hand hygiene center at rajampeta in kadapa