ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో తాత్కాలిక కూరగాయల మార్కెట్​ ఏర్పాటు - కడప తాజా వార్తలు

ప్రొద్దుటూరులో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్​ను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. మరో రెండేళ్లలో పాత మార్కెట్ స్థానంలోనే శాశ్వత కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.

proddutur
ప్రొద్దుటూరులో తాత్కాలిక మార్కెట్

By

Published : Jun 16, 2021, 9:22 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్​ను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. మరో రెండేళ్లలో పాత మార్కెట్ స్థానంలోనే శాశ్వత కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు తామంతా కృషి చేస్తామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రజలకు అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బాధ్యత తీసుకుని మార్కెట్​ను ఏర్పాటు చేశారని ఆయన కొనియాడారు.

58 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే శాశ్వత మార్కెట్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details