ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరకుల పంపిణీ - lock down latest news in rajampeta

లాక్​డౌన్​ కారణంగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విశ్వబ్రాహ్మణులకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు రాయచోటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఛైర్మన్​ నరసింహాచారి తెలిపారు. రాజంపేటలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పేద విశ్వబ్రాహ్మణులకు ఆయన నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ
విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : May 31, 2020, 10:36 PM IST

కరోనా ప్రభావంతో పనులు లేక చాలామంది విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు రాయచోటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ఛైర్మన్ నరసింహాచారి తెలిపారు. కడప జిల్లా రాజంపేట వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పేద విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను అందజేశారు.

జిల్లాలో పెద్ద సంఖ్యలో ఈ వర్గానికి చెందిన వారు ఉన్నారని చెప్పారు. వారిలో పేదలను ఆదుకునేందుకు తమ సంఘం ద్వారా ఇప్పటికే అనేక మండలాల్లో నిత్యావసర వస్తువులు అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details