ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​ దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ - essential goods distribution in kadapa district

జిల్లాలో పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించేట్టుగా అధికారులు చర్యలు తీసుకున్నారు. నెలలో రెండు సార్లు రేషన్​ షాపుల్లో నిత్యావసర సరుకులు పంచనున్నట్లు తెలిపారు.

essential goods distributed in ration shops at kadapa district
కడప జిల్లాలో నిత్యావసరాల వస్తువుల పంపిణీ

By

Published : Mar 29, 2020, 7:29 PM IST

మైదకూరు

రేషన్​ దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర సరుకులను పారదర్శకంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఇందిరమ్మ కాలనీలోని రేషన్ దుకాణంలో పేదలకు కిలో కందిపప్పు, బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. ఏప్రిల్ 4న తెల్ల రేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయల చొప్పున నగదు పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించారు.

కడపలో..

కడప

కడప 51 డివిజన్​లో ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. ప్రజలు చాలా మంది సామాజిక దూరాన్ని పాటించారు. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం, చక్కెర, కందిపప్పు, గోధుమ పంపిణీ చేశారు.

వేంపల్లిలో..

వేంపల్లి

వేంపల్లి రేషన్ షాపుల్లో ప్రజలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేశారు. ప్రతి డీలర్ షాపు వద్ద నీళ్లు, సబ్బు పెట్టారు. ప్రతి రేషన్ కార్డు దారుడు డీలర్ షాపు వద్ద చేతులు కడ్కుకొని వెళ్ళాలని అధికారులు సూచనలు చేశారు. కార్డుకు ఒక్కరు మాత్రమే రావాలని కోరారు. సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఉచితంగా బియ్యం, కందిపప్పు కోసం తెల్లవారుజాము నుంచే ప్రజలు బారులు తీరారు. బయోమెట్రిక్​ విధానంలో తగిన జాగ్రత్తలతో కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.

ఇదీ చదవండి:

ప్రజాసేవకులకు 21 రోజుల పాటు ఉచిత భోజనం

ABOUT THE AUTHOR

...view details