కడప జిల్లా రాజంపేట పురపాలికలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మీ నేస్తం అన్నమయ్య స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 12 రకాల నిత్యావసర వస్తువులు అందజేశారు. కరోనా నియంత్రణ భౌతిక దూరం, పరిశుభ్రతతోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని అమర్నాథ్ రెడ్డి సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు సాయం చేయడానికి.. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
రాజంపేటలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ
కడప జిల్లా రాజంపేటలో పారిశుద్ధ్య కార్మికలకు మీ నేస్తం అన్నమయ్య స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
రాజంపేటలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకుల పంపిణీ