కడప జిల్లా పొద్దుటూరు వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు 45 మందికి పురపాలక కమిషనర్ రాధ మెమోలు జారీ చేశారు. పింఛన్లకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదన్న విషయంపై ఆగ్రహించిన కమిషనర్.. వారికి వాట్సాప్ ద్వారా మెమోలు పంపారు. అయితే శిక్షణలో ఉన్న వారికి కూడా ఇవ్వడంపై కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెమోలో తేదీ తప్పు ఉన్నా.. కమిషనర్ అవేవీ పట్టించుకోక పోవడం గమనార్హం. మెమోలో ఒక చోట జనవరి 13వ తేదీ ఉండగా.. మరో చోట ఫిబ్రవరి 25 అని ఉంది. అది గమనించకుండానే కమిషనర్ సంతకం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెమోల జారీలో తప్పులు... కమిషనర్‌పై విమర్శలు - కడప పురపాలక కమిషనర్ మెమోల జారీలో తప్పులు తాజా వార్తలు
ప్రొద్దుటూరు వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు మెమోల జారీపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పురపాలక శాఖ కమిషనర్ కనీసం తేదీని కూడా చూసుకోకుండా ఎలా ఇచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
మెమోల జారీలో తప్పులు... కమిషనర్‌పై విమర్శలు