Viveka murder case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో మొదటి నిందితుడిగా ఉన్నఎర్ర గంగిరెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్ అధికారులు సిద్ధం చేసిన రెండు దర్యాప్తు నివేదికలను కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
viveka murder case: పులివెందుల కోర్టులో ఎర్ర గంగిరెడ్డి పిటిషన్
13:30 February 18
సిట్-1, సిట్-2 దర్యాప్తు నివేదికలు కోర్టుకు ఇచ్చేలా ఆదేశించాలని వినతి
సీఆర్పీసీ 207 సెక్షన్ ప్రకారం నివేదికలిచ్చేలా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో.. సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తమకు అవసరమున్న మేరకే విచారణ నివేదికను తీసుకుంటున్నామని సీబీఐ అధికారులు కౌంటర్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణను పులివెందుల కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.
సీబీఐ విచారణ ముమ్మరం..
Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా.. వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను.. సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో.. మరోసారి కోర్టులో వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.
ఇదీ చదవండి:Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరం