విద్యుత్ పనులు చేయడానికి వెళ్లిన ఆ శాఖ సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోయారు. కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో జరిగిందీ సంఘటన. వరద ప్రవాహానికి దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను సరిచేయడానికి.. పది మంది సిబ్బంది పంట పొలాల్లోకి వెళ్లారు. పని ముగించుకుని వచ్చేసరికి పుల్లంగేరు కాలువ ఉదృతంగా ప్రవహించింది.
వరద ప్రవాహంలో బయటకు రాలేక ఉద్యోగులు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న ఇతర ఉద్యోగులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాళ్లను రక్షించారు.