ఎన్నికల పరిశీలకురాలు కర్పగం కడప జిల్లా రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో.. ఎన్నికల పరిశీలకురాలు కర్పగం పర్యటించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా సిబ్బంది పని చేయాలని కోరారు. రాయచోటి నియోజకవర్గంలో అతి సమస్యాత్మక కేంద్రంగా గుర్తించిన 44వ పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈవీఎం, భద్రత సిబ్బంది శిక్షణ, సీసీ కెమెరాల నిర్వహణ, వీడియో చిత్రీకరణ, నామినేషన్ల పరిశీలన, హెల్ప్ డెస్క్ పనితీరును ఎన్నికల అధికారి మల్లికార్జునుడుని అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల జాబితాలు, బి-ఫారాలు, అఫిడవిట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.