కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మీసేవ కేంద్రాలతో పాటు పలు బ్యాంకులు వద్ద ఈకేవైసీ నమోదుకు... తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రజలు పడిగాపులు కాశారు. మీ సేవ కేంద్ర నిర్వాహకులు 10 గంటలకు వచ్చి...కేవలం 20 మందికే టోకెన్లు ఇచ్చి ఆధార్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి వద్దకు సిబ్బందిని పంపించి ఆధార్ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఈకేవైసీ కష్టాలు తీరేదెప్పుడో... - కడప జిల్లా రాజంపేట
బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్ద ఈకేవైసీ కష్టాలు ఇంకా తీరడం లేదు. కుటుంబ సమేతంగా ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈకేవైసీ నమోదుపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా రాజంపేట ప్రజలు కోరుతున్నారు.
ఈకేవైసీ కష్టాలు తీరేదెప్పుడో...