ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప రిమ్స్​లో చిన్నారి కిడ్నాప్.. మహిళను పట్టుకున్న సెక్యూరిటీ - 8 daysold babywas kidnapped

Child Kidnap In Rims: కడప రిమ్స్​లో ఓ చిన్నారిని మహిళ ఎత్తుకెళ్లింది. తనకు గర్బం వచ్చినట్లు నటించి.. ఓ తల్లికి మాయమాటలు చెప్పి చిన్నారిని ఎత్తుకెళ్లింది. దీనిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ప్రశ్నించి.. చిన్నారిని క్షేమంగా తల్లికి అప్పగించారు.

Rims child kidnap
Rims child kidnap

By

Published : Jan 3, 2023, 10:49 PM IST

Child Kidnap In Rims: కడప రిమ్స్​లో ఎనిమిది రోజుల చిన్నారి కిడ్నాప్ జరిగింది. నగరంలోని అక్కయపల్లికి చెందిన సోనీ అనే మహిళ చిన్నారి తల్లికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిన ఘటన రిమ్స్​లో చోటు చేసుకుంది. సోనీ అనే మహిళ తనకు గర్భం వచ్చినట్లు ప్లాస్టిక్ బెల్లినీ కట్టుకుని, తన భర్తకు చిన్నారిని చూపిస్తానని చెప్పి బిడ్డను ఎత్తుకెళ్లింది. హాస్పిటల్ సెక్యూరిటీ చిన్నారిని తల్లికి అప్పజెప్పారు. తనకు పిల్లలు లేరని, అందుకే ఇలా చేశానని సోని చెప్పింది. సెక్యూరిటీ సిబ్బంది సోనీనీ పోలీసులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details