కడప జిల్లా నీలకంఠరావుపేటలో వేలాది గుడ్లను కొందరు వ్యక్తుల నేలపాలు చేశారు. అధికారులు దర్యాప్తులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లగా వీటిని గుర్తించారు. అయితే ఈ పని ఎవరు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. గర్భిణీలు బాలింతలు పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం నేలపాలు చేయడంపై అధికారులు కేంద్రాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో గుడ్లన్నీ నేలపాలు...తెలియని కారణాలు - గుడ్లన్నీ నేలపాలు...తెలియని కారణాలు
కడప జిల్లా రామాపురం మండలంలో నీలకంఠరావుపేటలో వేలాది గుడ్లను గుర్తుతెలియని వ్యక్తులు నేలపాలు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.బాధ్యులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
![కడప జిల్లాలో గుడ్లన్నీ నేలపాలు...తెలియని కారణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4544800-788-4544800-1569386958733.jpg)
కోడిగుడ్లు