ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఈనాడు క్రికెట్ విజేతలకు ట్రోఫీలు ప్రదానం - కడపలో ఈనాడు క్రికెట్ విజేతలకు ట్రోఫీలు ప్రధానం

ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు కడపలో ట్రోఫీలు ప్రధానం చేశారు. కడప అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.

Eenadu_Cricket_Final_Winner
కడపలో ఈనాడు క్రికెట్ విజేతలకు ట్రోఫీలు ప్రధానం

By

Published : Dec 28, 2019, 10:30 AM IST

కడపలో ఈనాడు క్రికెట్ విజేతలకు ట్రోఫీలు ప్రధానం

విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, క్రీడా స్ఫూర్తిని వెలికి తీయడానికి క్రీడలు ఉపయోగపడతాయని కడప అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. ఈనాడు క్రికెట్ టోర్నీలో భాగంగా... కడప శివారులోని కేఎస్ఆర్ఎం మైదానంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్​లో గెలుపొందిన జట్టుకు ఆయన చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పది రోజుల పాటు ఈనాడు ఆద్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో సీనియర్, జూనియర్ విభాగంలో 74 జట్లు పాల్గొన్నాయి. వాటిలో ఫైనల్ మ్యాచ్​లో సీనియర్ విభాగంలో కడప శ్రీహరి డిగ్రీ కళాశాల జట్టు, మహేశ్వరి కళాశాల జట్టు తలపడగా... శ్రీహరి డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది.

జూనియర్ విభాగంలో మహిళల జట్లు ఫైనల్లో పోటీ పడ్డాయి. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ మహిళల జట్టు, బద్వేలు ఎస్ఆర్ఎన్బీ మహిళా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే.... ట్రిపుల్ ఐటీ జట్టు విజయం సాధించింది. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో కడప అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, స్టెప్ సీఈవో రామచంద్రారెడ్డి, ఈనాడు యూనిట్ మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details