ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి' - ఒంటిమిట్టలో మూడో విడత పంచాయతీ ఎన్నికలలో చదువుకున్న యువతి పోటీ

చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిస్తున్నారు.. మూడో విడత పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కత్తి వరలక్ష్మి. విద్యావంతులైన నేతలు ఉన్నప్పుడే దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆమె అన్నారు.

educated  candidate
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి

By

Published : Feb 17, 2021, 4:17 PM IST

కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతులేకుండా.. బరిలో నిలబడ్డారు. ఎంకామ్​ వరకు చదువుకున్న ఆమె.. తన ఊరి సమస్యలను పరిష్కరించాలనే ధ్యేయంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

రాజకీయాల్లో చదువుకున్న నేతలు కరువవుతుండటం వల్లే చాలామందికి అన్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. యువత కూడా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో ఏ పార్టీ మద్దతులేకున్న స్వతంత్రంగా పోటీలో నిలిచానని వెల్లడించారు. తమ గ్రామంలో రోడ్లు, మురుగు వ్యవస్థ అధ్వానంగా ఉందని.. గెలిచిన వెంటనే అభివృద్ధికి శ్రీకారం చుడతానని వరలక్ష్మి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details