ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ జోన్​గా మార్చారు... ప్రజలను మరిచారు - కడప జిల్లా రెడ్ జోన్ ప్రాంతాలు

కడప జిల్లా రాజంపేట పరిధిలోని ఈడిగపాలెం గ్రామస్థులు.. పురపాలక కమిషనర్​తో తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. అధికారులు తమ ప్రాంతాన్ని రెడ్ జోన్​గా మార్చి.. అనంతరం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. తాగునీటికీ ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.

Breaking News

By

Published : Jun 10, 2020, 4:56 PM IST

ఒకరికి కరోనా సోకిందని తమ ప్రాంతాన్ని రెడ్ జోన్​గా మార్చి... తర్వాత తమను పట్టించుకోవడం లేదని.. కడప జిల్లా రాజంపేట పరిధిలోని ఈడిగపాలెం గ్రామస్థులు వాపోయారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన పురపాలక కమిషనర్ రాజశేఖర్​కు తమ గోడు వెల్లబోసుకున్నారు. రెడ్ జోన్​లో ఉన్న తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

మంచినీరు రావడంలేదని.. అప్పుడప్పుడు వచ్చే కూరగాయలు అధిక రేట్లు ఉంటున్నాయని చెప్పారు. రెక్కాడితే కాని జీవనం సాగని తాము అంతంత రేట్లు పెట్టి తాగునీరు, కాయగూరలు కొనలేకపోతున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఇవీ చదవండి... ఎమ్మెల్యే సుధీర్​రెడ్డికి తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details