ED seizes bank accounts of cyber criminals in Kadapa case: సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లోని 27 కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. మేకింగ్ మనీ యాప్, ఆర్సీసీల పేరిట వైఎస్సార్ జిల్లాలో 11 కోట్ల రూపాయలను కొల్లగొట్టడంపై గతేడాది నవంబరులో కడప ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా తమిళనాడుకు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసి వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు ఎస్పీ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఈడీకి సిఫారసు చేశామన్నారు. ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించి స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాల్లోని 27 కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసిందని ఎస్పీ వెల్లడించారు.
వైఎస్సార్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఖాతాలు సీజ్ చేసిన ఈడీ - Cyber criminals in YSR district
ED seizes bank accounts of cyber criminals in Kadapa case: మేకింగ్ మనీ యాప్, ఆర్సీసీల పేరిట కోట్ల సొమ్మును కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్ట్ చేశారు.. తదుపరి చర్యల కోసం ఈడీకి సిఫారసు చేశామన్నారు. నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను ఈడీ జప్తు చేసినట్లు తెలిపారు.
కడప ఎస్పీ అన్బురాజన్