కడపజిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె మండలంలో భూమి కుంగింది. ఇటీవలె కురిసిన వర్షాలకు మండలంలోని భీరంఖాన్ పల్లె సమీపంలో భూమి కుంగింది. దాదాపు 20మీటర్ల లోతు గొయ్యి పడింది. గతంలో కూడా ఇదే మండలంలో ఇలాగే భూమి కుంగి గొయ్యిలు ఏర్పడ్డాయి. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లాలంటే.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. సమీపంలో పలు నివాసాలు ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వచ్చి పరిశీలిస్తున్నారు.
చింతకొమ్మదిన్నెలో కుంగుతున్న భూమి - NEWS ON LAND TRMBLING AT CHINTHAKOMMADINNEY
కడపజిల్లా కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె మండలం భీరంఖాన్ పల్లెలో భూమి కుంగుతుంది. దాదాపు 20మీటర్ల లోతు గొయ్యి పడింది
చింతకొమ్మదిన్నెలో కంగుతున్న భూమి