కడపలో కమనీయంగా దసరా ఉత్సవాలు - దేవి నవరాత్రులు
దసరా మహోత్సవాల్లో భాగంగా కడప జిల్లా రాజంపేటలోని ఘనంగా దుర్గాష్టమి వేడుకలు జరిగాయి. వివిధ ఆలయాల్లోని అమ్మవార్లు మహిషాసురమర్ధినిగా దర్శనమివ్వగా, భక్తులంతా వేల సంఖ్యలో తరలి వచ్చి అమ్మవార్లకి పూజలు నిర్వహించారు.
![కడపలో కమనీయంగా దసరా ఉత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4674228-900-4674228-1570393990813.jpg)
కడపలో కమనీయంగా దర్శనమిచ్చిన మహిషాసురమర్ధిని అలంకారాలు...
కడపలో కమనీయంగా దర్శనమిచ్చిన మహిషాసురమర్ధిని అలంకారాలు...
కడప జిల్లాలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జిల్లాలోని రాజంపేట కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో దుర్గాష్టమి వేడుకల్లో భాగంగా అష్టాదశ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. మహిషాసుర మర్ధిని అలంకరణలో వాసవి మాత దర్శనం ఇవ్వగా, భక్తులు కనులారా చూసి తరించారు. సాదు కామాక్షమ్మ, వీర చౌడేశ్వరి దేవి, ఉదయగిరి ఎల్లమ్మ ఆలయాల్లో మహిషాసుర మర్ధిని అలంకారంలో అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
ఇదీ చూడండి: