కడప జిల్లా ఖాజీపేట మండలం మునిపాకలో భూ తగాదా ఒకరిని బలితీసుకుంది. బావ బావమరదుల మధ్య జరిగిన సంఘటనతో బావమరది షేక్ గౌస్‌పీర్ (55) మృతి చెందాడు. గత ఆరేళ్లుగా గౌస్‌పీర్‌కు.. బావ నాయబ్ రసూల్‌కు మధ్య వివాదం నెలకొంది.
ఆదివారం పొలం వద్ద గౌస్‌పీర్ కంపచెట్లు తొలగించే పనులు చేసుకుంటూ ఉండగా నాయబ్ రసూల్‌తోపాటు అతని అనుచరులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.