ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షానికి కుంటకు గండి.. గ్రామంలోకి చేరిన వరదనీరు

కడప జిల్లా రాజుపాలెం మండలం చిన్నశెట్టిపల్లిలో భారీ వర్షానికి 90ఎకరాల్లో ఉన్న కుంటకు గండి పడింది. గ్రామంలోకి నీరు రావటంతో పంటపొలాలు మునిగిపోయాయి. ఇళ్లలోని వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

due to hole to water canel rain water came into village in kadapa dst
due to hole to water canel rain water came into village in kadapa dst

By

Published : Aug 31, 2020, 1:13 PM IST

భారీ వర్షానికి కుంటకు గండి.. గ్రామంలోకి చేరిన వరదనీరు

కడప జిల్లా రాజుపాలెం మండలంలో రాత్రి భారీ వర్షం కురిసింది. 86.6 వర్షపాతం నమోదయింది. రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షానికి చిన్న శెట్టిపల్లిలోని 90 ఎకరాల విస్తీర్ణంలో కుంటకు భారీ గండ్లు పడ్డాయి. దీంతో అందులోని నీరంతా గ్రామంలో ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల నీరు ఇళ్లలోకి చేరింది. నీటి ప్రవాహంతో అక్కడ అక్కడ పంటపొలాలు మునిగిపోయాయి. సుమారు వంద ఎకరాల్లో పంట దెబ్బతిందని రైతులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details