కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో సోమవారం రాత్రి వీచిన పెనుగాలులకు.. 250 ఎకరాలకు పైగా అరటి పంట ధ్వంసమైంది. కరోనా కారణంగా అరటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోగా.. పండిన పంట వర్షం రూపంలో నేలకొరిగింది. పెనుగాలులతో కూడిన అకాల వర్షం అరటి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. లక్షలు ఖర్చు చేసి పండించిన పంట.. చేతికి అందకుండా వానపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పుల్లో కూరుకున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షం.. అరటి రైతుకు అపార నష్టం
కరోనా ఒక పక్క.. వేళ కాని వేళలో కురుస్తున్న వర్షాలు మరో పక్క. పండిన పంటను అమ్మడానికి లాక్డౌన్ అడ్డు వచ్చి సగం నష్టపోతుంటే.. అకాల వర్షం మరింత నష్టాన్ని మిగిల్చింది. చేతికందిన పంటను నీట మునిగేలా చేసి.. రైతు కంట కన్నీటికి కారణమైంది.
due-to-heavy-rain-banana-farmers-lossed-their-crop-in-obulavaripalli-in-kadapa