కరోనా వైరస్ వల్ల గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇండియన్ ఎంబసీ వారు పాస్‌పోర్టు, వీసాలు లేకుండా పనులు చేసుకుంటూ ఉన్నవారికి.... భారత్ పంపిస్తామంటూ ప్రకటన జారీ చేయటంతో... వందల సంఖ్యలో ప్రవాసాంధ్రులు దరఖాస్తు చేసుకున్నారు. భౌతిక దూరం అంటూ కొందరిని అక్కడి నుంచి బయటికి పంపించారు. ఈ నేపథ్యంలో వారు రోడ్లమీదే పడిగాపులు కాస్తున్నారు. తినడానికి తిండి, తాగేందుకు నీరు లేక... బాత్రూం సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో ఉన్న వారి బంధువులకు కువైట్ నుంచి ఫోటోలు, వీడియోలు పంపి సమాచారం ఇవ్వటంతో... వారు ఈటీవీ భారత్‌ను సంప్రదించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కువైట్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి.... భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు.
గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రుల వెతలు.. ఆదుకోవాలని వేడుకోలు.. - గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న కడప వాసులు వార్తలు
కరోనా వైరస్‌తో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు ఇక్కట్లు తప్పడం లేదు. పాస్‌పోర్ట్ లేకుండా భారత్‌కు పంపిస్తామన్న ఇండియన్ ఎంబసీ అధికారుల ప్రకటనతో వందల సంఖ్యలో తెలుగువారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే భారీగా ఎంబసీ కార్యాలయానికి చేరుకున్న వీరిని భౌతిక దూరం పేరుతో అధికారులు బయటకు పంపేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు వారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు.
due to corona lockdown andra NRIs facing lot of problems in Gulf countries
TAGGED:
andra NRIs news in telugu