జనతా కర్ఫ్యూతో కడప జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలు బోసిపోయాయి. కరోనా ప్రభావంతో ఆలయాల వద్ద ఆధ్యాత్మిక శోభ కనిపించలేదు. దీనికితోడు ప్రధాని జనతా కర్ఫ్యూ పిలుపునకు ప్రజలు సంపూర్ణ సంఘీభావం తెలపడంతో.. ఆలయాల వద్ద భక్తులు కనిపించలేదు. గోవింద నామస్మరణల మధ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందిన ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, పవిత్ర పుణ్యక్షేత్రమైన నందలూరు సోమనాథ స్వామి ఆలయం, హత్యరాలలో వెలసిన కామాక్షి దేవి సమేత త్రేతేశ్వర స్వామి ఆలయం నిశ్శబ్దంగా మారింది.
నిర్మానుష్యంగా కడప పుణ్యక్షేత్రాలు - కడపలో జనతా కర్ఫ్యూ
నిత్యం ప్రజలతో అలరాడే ఆలయాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆలయాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.
![నిర్మానుష్యంగా కడప పుణ్యక్షేత్రాలు due to corona Janata curfew temples are closed at kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6507805-760-6507805-1584899265155.jpg)
due to corona Janata curfew temples are closed at kadapa district