కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనతా కర్ఫ్యూ కారణంగా నిత్యం ప్రజలు, వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ నిశ్శబ్దంగా మారాయి. కడప, తిరుపతి, నెల్లూరు, బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారులన్నీ బోసిపోయాయి. డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పురపాలక కమిషనర్ రాజశేఖర్ పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తూ అపరిశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణకు మందులను పిచికారి చేయించారు. జనతా కర్ఫ్యూకు ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు.
రాజంపేటలో జనతా కర్ఫ్యూ - జనతా కర్ఫ్యూ న్యూస్ ఇన్ కడప
జనతా కర్ఫ్యూకి ప్రజల సహకారం తోడవుతోంది. జనం వీధుల్లోకి రావటం లేదు. రాజంపేటలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
![రాజంపేటలో జనతా కర్ఫ్యూ due to corona Janata curfew continues at rajampeta in Kadapa district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6501229-248-6501229-1584861511330.jpg)
due to corona Janata curfew continues at rajampeta in Kadapa district.