కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేలి, రైల్వేకోడూరు మండలాలలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోన వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా భారత దేశ సమైక్యతను చాటారు. ఎప్పుడు జనంతో కిటకిటలాడే ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలోని దుకాణాలు మూతబడ్డాయి.
రైల్యేకోడూరులో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ - Janata curfew news in railwaykoduru
జనతా కర్ఫ్యూ కారణంగా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూని కొనసాగిస్తున్నారు.
due to corona Janata curfew continues at railwaykoduru in Kadapa district