కడపలో జనతా కర్ఫ్యూ ఇలా సాగుతోంది..!
కడప జిల్లాలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని 900 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెట్రోలు బంకులు మూతపడ్డాయి.