పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పని చేస్తాయని కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక రవాణా, నాటు సారా తయారీ పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అనే కొత్త సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపిన.. ఆయన ఇకపై 24 గంటలు అక్రమ రవాణాపై దృష్టి సారిస్తామన్నారు. జమ్మలమడుగు శివారులోని పెన్నానదిలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.