మూసిన గేటును తెరవలేదన్న కోపంతో మద్యం తాగిన వ్యక్తి రైల్వే గేట్ మెన్ పై దాడి చేశాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ పరిధిలోని జాగువారిపల్లి రైల్వేగేటు వద్ద జరిగింది. జాగువారిపల్లి రైల్వేగేటులో మస్తాన్ వలి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ద్విచక్రవాహనంపై రైల్వేగేటు వద్దకు చేరుకున్న ఓ వ్యక్తి గేటు తీయాలని అడిగాడు. ఉన్నతాధికారులను అడిగి తీస్తాను అని చెప్పి వెళుతున్న గెటమేన్ మస్తాన్ వలిపై మద్యం సేవించిన ఆ వ్యక్తి కర్రతో దాడి చేసి గాయపరిచాడు. గదిలోని టెలిఫోన్ పగలగొట్టాడు. ఈ సంఘటనపై రాజంపేట రైల్వేస్టేషన్ అధికారి నందలూరు... ఆర్.పి.ఎఫ్ పోలీసులకు, రేణిగుంట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మస్తాన్ వలిని నందలూరు రైల్వే ఆసుపత్రికి తరలించారు.
మద్యం మత్తులో రైల్వే ఉద్యోగిపై దాడి - corona cases kadapa dst
మద్యం మత్తులో ఓ వ్యక్తి రైల్వే గేట్ మెన్ పై దాడి చేశాడు. గదిలోని టెలిఫోన్ పగలగొట్టి నానా హంగామా చేశాడు. కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
drunker attack on railway gatemen in kadapa dst rajampeta near railway station