కడప జిల్లా కరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని కంటైన్మెంట్జోన్గా ప్రకటించారు. వాహన ఫిట్నెస్, ఎల్.ఎల్.ఆర్, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన టెస్టులకు హజరుకావాల్సిన వారు, స్లాట్ సమయంతో సంబంధం లేకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటలలోపు కార్యాలయానికి హజరుకావాలని కడప జిల్లా పొద్దుటూరు ఆర్డీవో వీర్రాజు పేర్కొన్నారు. జిల్లాలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ,ఆర్ సి, ఇతర సేవలకు నేరుగా కార్యాలయానికి రాకుండా 9666898005 నంబరుకు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించారు. కరోనా వ్యాప్తి కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆర్డీవో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'టైంస్లాట్తో సంబంధం లేకుండా వాహన ఫిట్నెస్ టెస్ట్' - ఈటీవీ భారత్ తాజా వార్తలు
కడప జిల్లాలో వాహన ఫిట్నెస్ టెస్టులకు హాజరు కావాల్సినవారికి నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. సమయంతో సంబంధం లేకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటలలోపు కార్యాలయానికి హజరుకావాలని పొద్దుటూరు ఆర్డీవో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
'టైంస్లాట్తో సంబంధం లేకుండా వాహన ఫిట్నెస్ టెస్ట్'