ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫోన్ కొట్టండి... తాగునీరు పట్టండి' - రాజంపేటలో తాగునీటి సమస్యకు పరిష్కారం

మీ గ్రామంలో తాగునీటి సమస్య ఉందా? అయితే ఒక్క ఫోన్ చేయండి... సమస్యను పరిష్కరించుకోండి అని చెప్తున్నారు కడప జిల్లా రాజంపేట ఆర్​డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీరన్న. నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు పరిష్కరించడం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారాయన.

driniking water problem in rajampet kadapa district
రాజంపేట ఆర్​డబ్ల్యూఎస్ ఈఈ వీరన్న

By

Published : May 12, 2020, 7:47 PM IST

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో తాగునీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రణాళికలు పంపినట్లు ఆర్​డబ్ల్యూఎస్ ఈఈ వీరన్న తెలిపారు. 15 మండలాల్లో 581 హ్యాబిటేషన్లలో తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. ట్యాంకర్లు, వ్యవసాయ బోర్లు, సాధారణ బోర్లలో అదనపు పైపులు వేయడం ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

ప్రస్తుతం 188 హ్యాబిటేషన్లలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని.. 21 వ్యవసాయ బోర్ల ద్వారా 20 గ్రామాలకు నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఏ గ్రామంలో అయినా తాగునీటి సమస్యలు ఉంటే 08565-295017కు ఫోన్ చేయాలని సూచించారు. ఫోన్ చేసిన వెంటనే ఆయా ప్రాంతాల్లోని తమ శాఖ అధికారులను పంపించి ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details