కడప జిల్లా జమ్మలమడుగు నుంచి 27 మంది వలస కూలీలను మధ్యప్రదేశ్‌కు పంపే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నుంచి వలస కార్మికులను ఆర్టీసీ బస్సులో ఒంగోలుకు తరలించారు. సాయంత్రం 4.30 గంటలకు ఒంగోలు నుంచి రైలు మధ్యప్రదేశ్‌కు బయలుదేరనుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.
స్థానిక డాన్ మిల్లులో పనిచేసేందుకు మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడకు వారు వచ్చారు. ఆర్టీసీ బస్సులోనే వీరికి పరీక్షలు జరిపిన అనంతరం రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, వైద్యాధికారులు వీడ్కోలు పలికారు.