ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులు అప్రమత్తంగా ఉండాలి' - ఎంపీ మిథున్ రెడ్డి తాజా వార్తలు

కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో ఎంపీ మిథున్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనసంచారం ఉన్నచోట్ల రసాయన ద్రావణాన్ని పిచికారి చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎంపీ మిథున్ రెడ్డి
ఎంపీ మిథున్ రెడ్డి

By

Published : Apr 12, 2020, 2:00 PM IST

కరోనా వైరస్ బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మాస్కులు, శరీరాన్ని కప్పేసే దుస్తులు ధరించాలని సూచించారు. కడప జిల్లా రాజంపేట పురపాలక భవనంలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల అధికారులతో కరోనాపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేయాలని అధికారులకు ఆదేశించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details