ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వైద్యుడు మృతి - కడపలో వైద్యుడి మృతి

కడప నగరంలో చిన్న పిల్లల వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల వెనకాల గాయమైన కారణంగా.. రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

doctor died in suspesious way at kadapa
అనుమానాస్పద స్థిలో వైద్యుడి మృతి

By

Published : May 30, 2020, 12:15 PM IST

కడప నగరంలో మల్లారెడ్డి అనే చిన్న పిల్లల వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పనిమనిషి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మల్లారెడ్డి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఉదయం పని మనిషి వచ్చి తలుపులు తట్టగా తెరవలేదు.

కిటికీలో నుంచి చూడగా.. డాక్టర్ నేలపై పడి ఉన్నారని గుర్తించి. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. తల వెనకాల గాయంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.

ABOUT THE AUTHOR

...view details