కడప శివారులోని పుట్లంపల్లి చెరువులో కరోనా మృతదేహాలను ఖననం చేయొద్దంటూ స్థానికులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. వర్షాకాలంలో చెరువులోకి భారీగా నీరు వస్తుందని.. ఆ నీటిని పొలాలకు, తాగేందుకు ఉపయోగిస్తామని స్థానికులు చెప్పారు. అలాంటి చెరువులో కరోనా లక్షణాలతో మృతి చెందిన వారి మృతదేహాలను ఖననం చేయటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మృతదేహాలను వేరేచోట ఖననం చేయాలని డిమాండ్ చేశారు.
'ఆ మృతదేహాలు మంచినీటి చెరువులో ఖననం చేయొద్దు' - latest kadapa news
కడపలోని మంచినీటి చెరువులో కరోనా బాధితుల మృతదేహాలను ఖననం చేయవద్దని స్థానికులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
మంచినీటి చెరవులో కరోనా మృతదేహాలు ఖననం చేయవద్దు